విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను రేపు అంటే మే 16వ తారీకున విడుదల చేయడం కన్ఫర్మ్ అయ్యింది.రౌడీ స్టార్ బర్త్ డే రోజున ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
విజయ్ దేవరకొండ మరియు సమంత లుక్స్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా ఉన్నాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ లుక్ ను ఇవ్వలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.సినిమా షూటింగ్ ను దాదాపుగా అక్కడే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
కశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ ను దాదాపుగా ముగించినట్లుగా సమాచారం అందుతోంది.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఏ సినిమాకు అయినా ముందుగానే టైటిల్ లీక్ అవుతూ ఉంటుంది.
టైటిల్ లీక్ అనేది మైత్రి వారు చేస్తూ ఉంటారు అంటూ కొందరు అంటూ ఉంటారు.మరి కొందరు మరో రకంగా ప్రచారం చేస్తారు.
విజయ్ దేవరకొండ, సమంత సినిమా యొక్క టైటిల్ ను ఎందుకు లీక్ చేయలేదు.అసలు ఇప్పటి వరకు టైటిల్ గురించి ఎలాంటి ప్రచారం రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.పెద్ద ఎత్తున ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తి నెలకొంది.ఒకటి రెండు టైటిల్స్ ప్రచారం జరిగి ఉంటే వార్తల్లో నిలిచేది.కాని ఇప్పుడు ఈ సినిమా గురించి ఏ ఒక్క టైటిల్ ను ప్రచారం చేయలేదు.దాంతో రేపటి కోసం విజయ్ దేవరకొండ మరియు సమంత అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సోషల్ మీడియాలో కనీసం ఊహ కూడా అందకుండా ఈ సినిమా టైటిల్ విషయం లో జాగ్రత్త పడ్డారు.మజిలీ వంటి విభిన్నమైన టైటిల్ తో వచ్చిన శివ నిర్వాన ఈ సారి ఏ టైటిల్ ను సామ్.
రౌడీ స్టార్ కు పెట్టాలి అనుకున్నాడో చూడాలి.ఈ ఏడాదిలోనే ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.