విశాఖ ఎంపీ సీటు ఎవరికో ? ఈ ఇద్దరి మధ్యే పోటీ ?

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత కొద్దిరోజులుగా ఏపీ తెలంగాణపై బీజేపీ ( BJP )అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.తెలంగాణ ఏపీలో బిజెపిని బలోపేతం చేసి, అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

 Visakha Mp Seat For Whom Competition Between These Two, Jagan, Ysrcp, Bjp, Cbn,-TeluguStop.com

అలాగే వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉండడంతో , కొద్దిరోజుల క్రితం ఏపీ,  తెలంగాణ బిజెపి అధ్యక్షులను మార్చారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి  దగ్గుపాటి పురందేశ్వరి ( Daggupati Purandeshwari )ని నియమించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని పురందరేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పదవి దక్కడంతో విశాఖ సీటుపై ధీమాగా ఉన్నారు.

అయితే ఇదే సీటుపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు.

Telugu Ap Bjp, Gvl Simharao, Jagan, Purandareswary, Vizag Mp, Ysrcp-Politics

విశాఖ లో బిజెపికి పట్టు ఉండడంతో, ఎంపీగా సునాయాసంగా గెలవగలనని నమ్మకంతో జివీఎల్ ఉన్నారు.ఈ సీటుపై ఆశలు పెట్టుకోవడంతోనే చాలాకాలంగా ఆయన విశాఖలోనే పాగా వేసి, తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు.పుట్టినరోజు సందర్భంగా విశాఖలో భారీగా ఆయన పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేసారు.

విశాఖ సిటీ మొత్తం భారీగా పోస్టర్లు అంటించారు.విశాఖ అభివృద్ధి కోసం జీవీఎల్ చేస్తున్న కృషిని కొనియాడుతూ అభిమానులు భారీగా పోస్టర్ లు వేశారు.

దీనికి తగ్గట్టుగానే జివీఎల్ కూడా పదే పదే విశాఖ అభివృద్ధి అంశంపై మాట్లాడుతున్నారు.

Telugu Ap Bjp, Gvl Simharao, Jagan, Purandareswary, Vizag Mp, Ysrcp-Politics

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో జీవిఎల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.అయితే ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న దగ్గుపాటి పురందరేశ్వరి ఈ టిక్కెట్ కోసం అప్పుడే గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో, అంతర్గతంగా పురందరేశ్వరి జీవీఎల్ కు మధ్య వార్ నడుస్తున్నట్లు సమాచారం.గతంలో పురందరేశ్వరి ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు .దీంతో వచ్చే ఎన్నికల్లోను ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి అవకాశం ఉంటుందనే అంచనాలో ఆమె ఉన్నారు.దీంతో ఈ సీటు ఎవరికి కేటాయించాలనే విషయంలో తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube