హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ( Etela Rajender )చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.రాబోయే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ హై కమాండ్ తెలంగాణ బిజెపిని ప్రక్షాళన చేయడం, ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి ఆస్థానంలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి( Minister Kishan Reddy ) ఆ బాధ్యతలు అప్పగించడం, అలాగే తనకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం వంటి వ్యవహారాలతో రాజేందర్ లో ఉత్సాహం కనిపిస్తోంది.
బిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన తరువాత తన స్థాయికి తగ్గ పదవి ,ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో రాజేందర్ ఉంటూ వస్తున్నారు.ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినా, బండి సంజయ్ తో సమన్వయం లేకపోవడంతో చేరికలు అంతంత మాత్రమే చోటు చేసుకున్నాయి.
తన ప్రభావం పెరగకుండా బండి సంజయ్ ( Bandi Sanjay )తో పాటు, కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తుండడం ఇవన్నీ రాజేందర్ కు అసహనాన్ని కలిగించాయి.
ఒక దశలో ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధమని సంకేతాలు పంపించారు.దీంతో బీజేపీ( Bjp ) హైకమాండ్ రంగంలోకి దిగి బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది.ఈటెల రాజేందర్ కు కెసిఆర్ కు సంబంధించిన బలం, బలహీనతలు ,వ్యూహాలు అన్ని తెలిసి ఉండడంతో ఆయన ద్వారానే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో ఆ పార్టీ హై కమాండ్ ఉంది.
అందుకే ఈటెల రాజేందర్ బండి సంజయ్ కారణంగా ఇబ్బంది పడకుండా అసంతృప్తికి గురి కాకుండా సంజయ్ ను పదవి నుంచి తప్పించింది.కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో రాజేందర్ కూడా హుషారుగా ఉన్నారు ఇక పూర్తిగా కేసీఆర్ పైనే దృష్టి సారిస్తానని, బీఆర్ఎస్( BRS ) ను ఓడించడమే తన లక్ష్యం అంటూ రాజేందర్ ప్రకటనలు చేస్తున్నారు.
చేరికల కమిటీ చైర్మన్ పదవితో పాటు, ఎన్నికల నిర్వహణ కమిటీని అప్పగించడంతో, రాజేందర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.అప్పటి వరకు కేసీఆర్ పై రాజేందర్ రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమైపోయారు.బీఆర్ఎస్ ఎత్తులు పై ఎత్తుల గురించి ,ఆ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు వ్యూహాలు ఎలా ఉంటాయనే విషయం రాజేందర్ కు తెలిసి ఉండడంతో, దానికి తగ్గట్లుగానే వ్యూహాలను రూపొందించి, వచ్చే ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాజేందర్ సిద్ధమవుతున్నారు.బండి సంజయ్ ని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించిన దగ్గర నుంచి రాజేందర్ బాగా యాక్టివ్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.