ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో తెలుసా?

హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ప్రతి రోజూ లేదా మనకు నచ్చిన ఏదో ఒక వారం నాడు ఆ దేవుడికి పూజ చేయడం చేస్తుంటాం.

అందు లోనూ చాలా మంది ఆలయాలకు వెళ్లి మరీ ఆ భగవంతుడిని దర్శించు కుంటారు.

అయితే ఎక్కువ మంది ఉదయం లేదా సాయంత్రమే గుడికి వెళ్తారు.అందుకు కారణం ఆ సమయాల్లో మాత్రమే ఎక్కువగా గుడులు తెరిచి ఉంటాయి.

మరీ పెద్ద పెద్ద గుడుల్లో అయితే పండుగలు, పబ్బాలప్పుడు లేదా ఆ దేవుడికి సంబంధించిన ప్రత్యేక పూజలప్పుడు మాత్రమే రోజంతా ఆలయం తెరిచి ఉంటుంది.

మామూలు సమయాల్లో అయితే చాలా వరకు మధ్యానం మూసేస్తారు.అయితే ఆంజనేయ స్వామిని దర్శించు కునేందుకు మధ్యాహ్నం 12 గంటల సమసయం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.

అదేంటి అనుకుంటున్నారా.అవునండి.

ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో మన పురాణాలు చెప్పాయి.అయితే అదేంటో మనం కూడా తెలుసుకుందాం.

తెల్లవారు జామున 3 గంటలకు శ్రీ మహా విష్ణువును పూజిస్తే.ఆయన దయ మనపై అపారంగా ఉంటుందట.

ప్రాతఃకాలం సూర్య భగవానుడిని ఉదయం 6 గంటల లోపు పూజించాలి.ఈ సమయంలోని పూజ శ్రీ రామ చంద్రుడికి, వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం.

ఉదయం 6 నుంచి 7 గంటల వరకు పరమ శివుడిని, దుర్గా దేవిని పూజిస్తే మంచి ఫలితం కల్గుతుంది.

మధ్యానం 12 గంటలకు ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట.సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి జరుగుతుంది.

సూర్యా స్తమయ సమయాన శివ పూజకు దివ్యమైన సమయం.రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె చూపెప్పుడూ మనపైనే ఉంటుందట.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!