రాజమౌళికి అబద్ధం చెప్పి శ్రీదేవికి బాహుబలిలో ఛాన్స్ రాకుండా చేసిన నిర్మాత..?

“బాహుబలి”( Baahubali ) తెలుగు సినిమా పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్లింది.అద్భుతమైన కథ, అంతకుమించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను ఒక మాస్టర్‌పీస్‌గా మలిచాయి.

 Why Bahubali Producer Wrong Info To Rajamouli Details, Baahubali, Ramya Krishna,-TeluguStop.com

భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ సినిమా, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.

బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వంటి నటీనటుల టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు.

ముఖ్యంగా ఈ సినిమాలో రమ్యకృష్ణ( Ramyakrishna ) శివగామిగా అద్భుతంగా నటించింది.

చందమామ లాంటి ఆమె ముఖం, కళ్లు, వాయిస్ అచ్చమైన రాజసాన్ని చూపించాయి.మాహిష్మతి రాజ్యానికి పాలించే రాణి శివగామిగా( Shivagami ) రమ్యకృష్ణ చాలా బాగా సూట్ అయింది.

అయితే మొదటగా ఆ క్యారెక్టర్‌కు ఈమెను తీసుకోవాలని అనుకోలేదు.అతిలోక సుందరి శ్రీదేవిని( Sridevi ) ఈ క్యారెక్టర్ కోసం తీసుకుందామని రాజమౌళి( Rajamouli ) అనుకున్నారు.

ఎందుకంటే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ వంటి బిగ్ మార్కెట్లలో కూడా మంచి గుర్తింపు ఉంది.ఆమెను తీసుకుంటే సినిమా ఇతర ప్రాంతాల్లో బాగా ఆడుతుందని రాజమౌళి భావించారు.

Telugu Anushka, Baahubali, Rajamouli, Prabhas, Prasad Devineni, Ramya Krishna, R

అయితే ఈ పాత్రలో నటించడానికి తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని, అంతేకాకుండా తన ఖర్చులు అన్నీ భరించాలని శ్రీదేవి చెప్పిందట.ఇదే విషయాన్ని నిర్మాత రాజమౌళికి చెప్పడంతో బడ్జెట్ ఎక్కువైపోతుందని రాజమౌళి ఆమెను పక్కన పెట్టేసారట.ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.అయితే ఈ మాటలు విన్న తర్వాత తను షాక్‌ అయ్యాయని నటి శ్రీదేవి రిప్లై ఇచ్చింది.తను అన్ని డబ్బులు అస్సలు అడగలేదని, నిర్మాత రాజమౌళి కి అబద్దం చెప్పి ఉంటాడని ఆమె వాపోయింది.

ఆ రేంజ్‌లో డబ్బులు అడిగే దాన్నైతే 300 సినిమాల్లో నటించగలనా? డబ్బు ఆశ ఉంటే ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేదాన్ని కదా అంటూ ఆమె ఒక లాజిక్ కూడా చెప్పింది.అయితే బాహుబలి ది బిగినింగ్ సినిమాను శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ప్రొడ్యూస్‌ చేశారు.

Telugu Anushka, Baahubali, Rajamouli, Prabhas, Prasad Devineni, Ramya Krishna, R

ఒకవేళ శ్రీదేవిని ఈ పాత్రకు తీసుకున్నట్లయితే ఆమె రాణిగా సూట్ అయ్యే ఉండకపోయేది కాదేమో అని ఈ సంగతి తెలిసిన చాలామంది కామెంట్లు చేశారు.ఏది ఏమైనా రమ్యకృష్ణ తనకు వచ్చిన ఈ పాత్రకు 100% న్యాయం చేసింది.దీని తర్వాత శైలజా రెడ్డి అల్లుడు, రొమాంటిక్, రిపబ్లిక్, లైగర్‌, బంగార్రాజు, రంగమార్తాండ, గుంటూరు కారం వంటి మంచి సినిమాల్లో నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube