కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందుకొని డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) .విక్రమ్ సినిమాతో ఈయన పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ హీరో విజయ్ తో లియో సినిమా కు పని చేశారు.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఈ సినిమా గురించి లోకేష్ పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించలేదని తెలుస్తుంది.

ఇలా లియో సినిమా( Leo Movie ) ప్రమోషన్లకు లోకేష్ ఆసక్తి చూపించకపోవడంతో లోకేష్ హీరో విజయ్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లోకేష్ విజయ్ మద్య గొడవలు చోటు చేసుకున్నాయని అందుకే ఈయన సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.నిజంగానే లోకేష్ హీరో విజయ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయ.
ఇదే నిజం అయితే లియో సినిమా పరిస్థితి ఏంటి అంటూ విజయ్( Hero Vijay ) అభిమానులు ఆందోళనకు గురయ్యారు.ఇలా వీరి గురించి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై నిర్మాత లలిత్ కుమార్ స్పందించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విజయ్ లోకేష్( Vijay Lokesh ) గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.వారిద్దరి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని వారిద్దరూ సొంత అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలా లోకేష్ విజయ్ గురించి వస్తున్నటువంటి వార్తలను నిర్మాత ఖండించడంతో విజయ్ అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.







