1.నిజామాబాద్ కు చేరుకున్న ఆర్పిఎఫ్ బైక్ ర్యాలీ
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన అధికారులు సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్ ర్యాలీ మంగళవారం నిజామాబాద్ కు చేరుకుంది.
2.ఎంపీ నామ నాగేశ్వరావు కుమారుడికి బెదిరింపు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృద్వి దారి దోపిడికి గురయ్యారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దాడి చేసి బెదిరించి పృద్వి అకౌంట్ నుంచి 75000 ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
3.తమిళ చిత్ర పరిశ్రమలు ఐటీ దాడుల కలకలం
తమిళ సినిమా పరిశ్రమలో మంగళవారం ఐటీ దాడులు కలకలం సృష్టించాయి.పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్ను ఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది.
4.గుజరాత్ లో 1500 ఆవులు మృతి

లంపి స్కిన్ వ్యాధి కారణంగా గుజరాత్ లో 1500 గోవులు మృత్యువాత పడ్డట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
5.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై
హైదరాబాద్ రాజ్ భవన్ లో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం లో తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొన్నారు.
6.అచ్చెన్నాయుడు కామెంట్స్

వైసీపీ ఆరాటకాలు చూసి చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని , టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్న నాయుడు అన్నారు.
7.పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
8.భక్తులకు టీటీడీ శుభవార్త

తిరుమల భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది.నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది.
9.నేడు తిరంగ ఉత్సవ్
పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక పర్యటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థిరంగా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
10.తిరుమల సమాచారం

ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహనంపై భక్తులకు తిరుమల శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
11.బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభమైంది.
12.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 13,434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర లింకులపై ఎన్ఐఏ నిఘా
నిజామాబాద్ లో ఉగ్ర లింకులపై ఎన్ ఐ ఏ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.ఆర్మూర్ కు చెందిన షేక్ నవీధ్ వ్యవహారాలపై విచారణను వేగవంతం చేసింది.
14.కరీంనగర్ జైలుకు కూర రాజన్న తరలింపు

జనశక్తి అగ్ర నేత కూర రాజన్నను కరీంనగర్ జైలుకు తరలించారు.
15.ఈనెల 7 నుంచి నేతన్న భీమా
దేశంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు భీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 7న ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
16.చికోటి ప్రవీణ్ పై సిబిఐ విచారణ జరిపించాలి

చీకోటి ప్రవీణ్ అక్రమ కాయకలాపాలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.
17.కేరళలో ఐదు మంకీ ఫాక్స్ కేసులు
కరోనా తో పాటు మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది.తాజాగా కేరళలో ఐదు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.
18.కేసీఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్

ఎనిమిదేళ్ల లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలంకు రాలేదని కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
19.బిజెపి పాదయాత్ర పై సిపిఐ విమర్శలు
అమరావతిలో బిజెపి చేపడుతున్న పాదయాత్ర పక్క డ్రామా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,500 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,820
.







