పదవుల కోసం రాజీనామా చేయలేదు..: పొన్నాల లక్ష్మయ్య

మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ పొన్నాల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

 Did Not Resign For Positions..: Ponnala Lakshmaiah-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ కోసం తాను కమిట్ మెంట్ తో పని చేశానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు.

వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తెచ్చిన వ్యక్తినన్న పొన్నాల పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనకు గురి చేశారని వాపోయారు.తనది 45 ఏళ్ల రాజకీయ జీవితమన్న పొన్నాల తనకు జరిగిన అవమానాలతో పార్టీని వీడుతున్నానని ప్రకటించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తీరుతో విసుగుచెందానని చెప్పారు.ప్రజల మద్దతు కూడగట్టే ఆలోచనలను చెప్పేందుకు తాను ప్రయత్నిస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ లో కొద్ది మందికే ప్రాధాన్యత ఇచ్చారన్న పొన్నాల లక్ష్మయ్య తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube