ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ( Exit polls)విడుదల కానున్నాయి.ఈ మేరకు రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో ఎవరికీ వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
అంతేకాదు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా జూన్ 9న జగనే ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో సంబరాలకు సైతం వైసీపీ ( YCP )సిద్ధమైంది.
మరోవైపు ఈసారి కూటమిదే అధికారమని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.సర్వే ఫలితాలు సైతం అదే నిర్ధారించాయని కూటమి నేతలు వెల్లడిస్తున్నారు.
అంతేకాదు వన్ సైడ్ విక్టరీ ఉంటుందంటూ నేతలకు చంద్రబాబు( Chandrababu ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆసక్తి ఏర్పడింది.