ఢిల్లీ, హర్యానా( Delhi, Haryana ) మధ్య వాటర్ వార్ నడుస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్, చిత్తరంజన్ పార్క్ వంటి పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.
యమునా నది నుంచి హర్యానా నీటి విడుదలను ఆపేసింది.దీంతో దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ మరియు నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు ఢిల్లీ జల్ బోర్డు( Delhi Jal Board ) రంగంలోకి దిగింది.ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా రేషన్ పద్ధతిలో వాటర్ సప్లై చేస్తుంది.
రోజు రోజుకు నీటి కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం హర్యానా సర్కార్ తో చర్చలు జరుపుతుంది.ఇప్పటికే నీటి సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.