చిరుత పులులు ( Leopards )చాలా చురుగ్గా, వేగంగా పరిగెత్తగలవు.తెలివిగా దాక్కుని సడన్‌గా దాడి చేయగల నైపుణ్యం వీటి సొంతం.
వేటాడటానికి, అవి ఒక నిర్దిష్ట ప్రదేశంలో దాగి ఉండి, ఆహారం దగ్గరికి వచ్చే వరకు ఓపికగా వేచి ఉంటాయి.ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు, వేగంగా దాడి చేసి, వాటిని పట్టుకుంటాయి.
హంట్ చేయడంలో వీటికి ఇవే సాటి.ఇవి చాలా ఎత్తుకు కూడా దూకగలవు.
చెట్లు, గోడలను సెకన్ల వ్యవధిలో ఎక్కగలదు, టీవీ, సఫారీ లేదా CCTV కెమెరాల ద్వారా చిరుతపులి వేటను మనం చూడవచ్చు.ఈ వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తాజాగా అలాంటి ఓ పులి హంటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పులి వేట తమిళనాడు( Tamil Nadu )లోని కోయంబత్తూరులో వెలుగు చూసింది.ఇది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.ఈ క్లిప్ ప్రకారం, ఒక అర్ధరాత్రి, ఒక కోడి ఇంటి గోడపై కూర్చుని ఉంది.ఆ గోడ ఎత్తు సుమారు 10 అడుగులు.చుట్టూ చీకటిగా ఉండటం వల్ల, రాత్రి సమయం అని తెలుస్తుంది.
ఆ ఒక వైపు నుంచి రెండు టార్చ్ లాంటి కాంతులు వస్తాయి.ఆ కాంతులు ఒక చిరుతపులి కళ్ల నుంచి వచ్చిన ప్రతిబింబాలు అని తేలుతుంది.

తరువాత ఈ వీడియోలో చిరుతపులి కోడిని ( Hen )వేటాడటం చూడవచ్చు.చిరుతపులి చాలా వేగంగా, నైపుణ్యంతో కోడిని వేటాడుతుంది.10 అడుగుల గోడను సింపుల్‌గా ఎక్కేస్తుంది.కోడి వెంటనే అక్కడి నుంచి కిందకు దూకుతుంది.
దాంతో పులి కూడా జంప్ చేసి కోడిని ఈజీగా నోట కరచుకుంటుంది.ANI (@ANI) అనే మీడియా సంస్థ ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
దీన్ని చూసిన చాలామంది చిరుత హంటింగ్ స్కిల్స్ ను పొగిడేస్తున్నారు.జస్ట్ సెకండ్లలోనే కోడిని ఈ చిరుత భలేగా పట్టేసింది గా అని అంటున్నారు.
అలాగే దానివల్ల ఎవరికైనా హాని జరిగిందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







