నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది.ఈ క్రమంలో సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాశ్ తో పాటు మరో అధికారి సస్పెండ్ అయ్యారు.
ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో కస్టం మిల్లింగ్ బియ్యం రికవరీ విధుల్లో అలసత్వం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది.నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రైస్ మిల్లులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది.
ఈ విషయాలన్ని ఉన్నతాధికారులు చేసిన విచారణలో తేలడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రజాప్రతినిధికి చెందిన మిల్లులకు కేటాయించారని విచారణలో రుజువైనట్లు సమాచారం.