ఆహార విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Authorities ) కొరడా ఝుళిపించారు.ఈ మేరకు హన్మకొండలో పలు రెస్టారెంట్ల( Restaurants )పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఇందులో భాగంగా బూజుపట్టిన మాంసంతో పాటు పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు.కుళ్లిపోయిన చికెన్, హానికరమైన రంగులు, ఇతర రసాయనాలు వాడుతున్నట్లు నిర్ధారించారు.
ఈ క్రమంలోనే బూజుపట్టిన ఆహార పదార్థాల శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.తరువాత నమూనాలను ల్యాబ్ కు పంపారు.
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.