మారుతున్న కాలం, బిజీ జీవనశైలి ఒత్తిడి వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు.ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవటానికి అన్ని కాలాలలోను అందుబాటులో ఉండే కాకరకాయ సహాయపడుతుంది.
కాకరకాయలో క్యాలరీలతో పాటు విటమిన్- సి, విటమిన్- ఏ సమృద్ధిగా ఉంటాయి.కాకరకాయలో ఉండే ప్రత్యేక లక్షణాలు మధుమేహంను కంట్రోల్ చేయటంలో సహాయపడుతుంది.
అంతేకాక కాకరకాయను రెగ్యులర్ గా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్ అంది మలబద్దకం సమస్య కూడా దూరం అవుతుంది.కాకరకాయ రసం శరీరంలో ఆల్ఫా గ్లూకోసైడ్స్ ను తగ్గించటంలో సహాయాపడుతుంది.
దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి.అంతేకాక భోజనం అయ్యాక కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.
కాకరకాయ రసాన్ని ప్రతి రోజు ఉదయాన్నే త్రాగాలి.ఈ విధంగా క్రమం తప్పకూండా త్రాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కాకరకాయలో ఉండే క్యారెటిన్ మరియు మొమొర్సిడిన్ వంటి యాంటీహైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించటంలో సహాయపడతాయి.
ఒక గ్లాస్ నీటిలో ఒక చిన్న కాకరకాయ ముక్కను వేసి మరిగించి టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.అలాగే కాకరకాయను ఉడికించి నీటిని వడకట్టి కూడా త్రాగవచ్చు.కాకరకాయలో ఉండే విత్తనాలు కూడా మధుమేహంను కంట్రోల్ చేయటంలో సహాయపడతాయి.
విత్తనాలలో పాలిపెప్టైడ్ పి అనే కంటెంట్ ఇన్సులిన్ మీద పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గిస్తుంది.కాకరకాయతో రకరకాల వంటలను చేసుకొని కూడా తినవచ్చు.చేదు ఇష్టం లేని వారు కూరను కాస్త స్పైసీగా చేసుకోవచ్చు.