డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడిగా,ఎంపిగా, కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించారు.
అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు చేశారు.ఆయన గొప్ప సామాజిక విప్లవకారుడు.
పలుమార్లు జైలుకు వెళ్లారు.జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ ర్లు చూపిన మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నరు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరు.సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది.సంక్షేమానికి 2016-17లో 35వేల 285 కోట్లు ఖర్చు చేయగా, గతేడాది ఇది 67వేల 787కోట్లకు పెరిగింది.2022-23లో 93వేల 489కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు SC ల సముద్ధరణకు 60వేల కోట్లు ఖర్చు చేశాం.
268 గురుకులాల ద్వారా SC విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నం.ఆడబిడ్డలు తమ చదువులను మధ్యలో వదిలేయకుండా 30 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినం.SCలలో నెలకొన్న పేదరికాన్ని రూపుమాపేందుకు కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.అత్యద్భుతమైన ఈ కార్యాన్ని మహా యజ్ఞం మాదిరిగా ముందుకు తీసుకుపోతున్నం.ఇప్పటికి 40వేల కుటుంబాలకు మేలు జరిగింది.
ఈ ఏడాది 2 లక్షల కుటుంబాలకు మంచి జరుగుతుంది.
మొత్తం 17లక్షల కుటుంబాలలోని 70లక్షల మంది కళ్లలో వెలుగులు చూస్తం.
ఇటువంటి మహత్తరమైన పథకం ఒక తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు.మొత్తం 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు త్వరలోనే వస్తయ్.
మన SC యువత రిజర్వేషన్లలోనే కాకుండా మెరిట్ సాధించి మంచి ఉద్యోగాలు పొందాలి.ఇందుకోసం 11 స్టడీ సర్కిల్స్, ప్రభుత్వ ఛానెల్ T -SAT ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తున్నం.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న.