నిద్ర‌లేమికి చెక్ పెట్టే జీడిప‌ప్పు.. ఇంత‌కీ ఎలా తీసుకోవాలో తెలుసా?

నిద్రలేమి( Insomnia ).ప్రస్తుత టెక్నాలజీ కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు.

 Cashew Nuts Help To Get Rid Of Insomnia!, Cashew Nuts, Insomnia, Latest News, He-TeluguStop.com

నిద్రలేమి అనేది చిన్న సమస్యగానే కనిపించిన చాలా ప్రమాదకరమైనది.నిద్రలేమి క్రమంగా కొనసాగితే ఎన్నో జబ్బులు తలెత్తుతాయి.

గుండెపోటు వచ్చే రిస్క్ పెరుగుతుంది.బరువు పెరుగుతారు.

మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.నీరసం, అలసట వంటివి విపరీతంగా వేధిస్తాయి.

Telugu Cashew Nut Milk, Cashew Nuts, Tips, Insomnia, Latest, Problems-Telugu Hea

అందుకే చాలా మంది నిద్రలేమి నుంచి బయటపడేందుకు మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా అందుకు జీడిపప్పు అద్భుతంగా సహాయపడుతుంది. జీడిపప్పు( Cashew )ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎలాంటి నిద్రలేమి అయినా సరే దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు జీడిపప్పులు వేసి ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పులు వాటర్ తో సహా వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు పోసుకోవాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పాలు మరిగించాలి.

ఆపై గ్రాండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్, చిటికెడు కుంకుమ పువ్వు మరియు వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి ( Mishri )వేసి మ‌రో నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Cashew Nut Milk, Cashew Nuts, Tips, Insomnia, Latest, Problems-Telugu Hea

ఆపై స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న జీడిపప్పు పాలు( Cashew Milk )ను గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ పాలు తాగాలి.ఈ జీడిప‌ప్పు పాలల్లో మెలటోనిన్‌తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.

వీటి క‌ల‌యిక వ‌ల్ల ప్ర‌శాంత‌మైన, సుఖ‌మైన నిద్ర మీ సొంతం అవుతుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య దూరం అవుతుంది.

నిత్యం నైట్ ఈ జీడిప‌ప్పు పాలును తాగితే ప‌డుకున్న వెంట‌నే గాడ‌ నిద్ర‌లోకి జారుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube