ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే మగువలు కొద్ది రోజుల ముందు నుంచి చర్మ సౌందర్యం శ్రద్ధ వహిస్తుంటారు.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్, బ్లీచ్( Facial, bleach ) చేయించుకుంటూ ఉంటారు.
అయితే అవి తాత్కాలికంగా పరిష్కారాన్ని అందించినా.చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేస్తాయి.
కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పది రోజుల్లో తెల్లటి మెరిసే కాంతివంతమైన చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk powder ), వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn flour ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ మరియు మూడు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకుని అన్ని కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న అనంతరం చర్మానికి కొంచెం అలోవెరా జెల్( Aloe vera gel ) ను అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఈ విధంగా రోజుకు ఒకసారి చేస్తే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మచ్చలు, మొటిమలు ఏమైనా ఉంటే దెబ్బకు మాయం అవుతాయి.స్కిన్ స్మూత్ గా, సూపర్ షైనీ గా మెరుస్తుంది.చర్మం అందంగా యవ్వనంగా మారుతుంది.కాబట్టి ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉంది అనుకుంటే పది రోజుల ముందు నుంచి ఈ రెమెడీని పాటించండి.దాంతో పైసా ఖర్చు లేకుండానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు.