టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్.నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఎన్నో సినిమాలలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు అడవి శేష్.2010లో కర్మ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అడవిశేష్.తన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.2018లో విడుదలైన గూఢచారి సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.అంతేకాకుండా ప్రస్తుతం మేజర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమా ఉన్నికృష్ణన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే తను ఓ మాట విన్నందుకు తన గుండెజారిపోయిందట.

2016లో రవికాంత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా క్షణం.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అడవి శేష్ మంచి సక్సెస్ ను అందించింది.ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు అడవి శేష్.ఈ సినిమా స్క్రిప్ట్ కోసం తను, డైరెక్టర్ పీవీసీ సినిమా ఆఫీస్ లో 7 నెలలు కూర్చున్నారట.
ఇక పీవీ వాళ్లను బాగా చూసుకున్నారట.కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు తమని అదోలా చూసేవారట.
ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటే.వీళ్లేవర్రా బాబు.
చిన్న కథ పట్టుకొని అన్నట్లు ప్రవర్తించేవారట.ఒకరోజు పీవీ తమ దగ్గరికి వచ్చి అక్కడ తమ స్నేహితులు కూడా కొందరు ఉన్నారని తెలిపాడు.
ఇక వాళ్ళకి కథ వినిపించమని చెప్పాడట.వాళ్ళు ఓకే అంటే.
షూటింగుకి వెళ్ళిపోదామని అనడంతో తాము ఉత్సాహంగా రెడీ అయ్యారట.అక్కడ ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లో అందరూ కూర్చున్నారని.
పీవీ తో పాటు నిరంజన్ రెడ్డి, పలువురు అక్కడికి వచ్చారని తెలిపాడు.

ఇక తను ఉత్సాహంగా కథ చెప్పాడట.స్క్రీన్ ప్లే వివరిస్తున్న సమయంలో కొందరు ఇక్కడ కొంచెం మారిస్తే సరిపోతుందని, ఆ సీన్ లో ఇది బాగా లేదని, మిగతా అంతా ఓకే అని తమతమ అభిప్రాయాలు చెబుతున్నారట.ఇక ఇంకొకతను.‘ఐ ఫీల్.స్క్రిప్ట్ మార్చి రాయాలి అనేసరికి తన గుండె ఒక్కసారిగా జారిపోయిందట.
ఏడు నెలల కష్టం బూడిదలో వేసినట్లు అయిందని కదురా అన్నట్లు తను రవికాంత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట.ఇక ఈ సినిమా చేయాలా వద్దా అన్నట్లు ముఖం పెట్టాడట పీవీసీ.
ఇక నిరంజన్ రెడ్డి.పీవీని పిలిచి బయటికి వెళ్ళాడట.
ఇక తమకు ఏమీ అర్థం కాక.తమను ఎలా బయటకు పంపించాలో అని అనుకుంటున్నారేమో అని అనుకున్నారట.ఇక వారిద్దరి లోపలికి వచ్చి.ఈ సినిమా చేస్తున్నాం.50 శాతం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని నిరంజన్ రెడ్డి అనడంతో పోయిన ప్రాణం ఒక్కసారిగా తిరిగి వచ్చినట్లయిందట.