ఇటీవల కాలంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో తమిళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి వరలక్ష్మి త్వరలోనే శబరి( Sabari ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా మే మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషలలో కూడా అదే రోజే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ని ఒక రిపోర్టర్( Reporter ) ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో మీరన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా( Character Artist ) నటిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తుండగా వెంటనే వరలక్ష్మి నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాను అంటూ ఎదురు ప్రశ్నివేశారు.
వీర సింహారెడ్డి సినిమాలో( Veerasimha Reddy ) మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటించారు కదా ప్రధాన పాత్రలను కాకుండా మిగతా అందరిని అలాగే పిలుస్తారు కదా అంటూ రిపోర్టర్ చెప్పడంతో వరలక్ష్మి స్పందిస్తూ.సరే హీరో హీరోయిన్లతో పోలిస్తే ఎవరి రోల్ ఎక్కువగా ఉంది అని అడిగితే హీరోయిన్ రోల్ కంటే మీదే ఎక్కువ ఉందని సదరు రిపోర్టర్ పేర్కొన్నారు.నాదే ఎక్కువ అంటే నేనే లీడ్, నా ప్రకారంలో ఆ సినిమాలో బాలకృష్ణ( Balakrishna ) గారి తర్వాత నాదే మెయిన్ లీడ్ రోల్ అంటూ ఈమె కామెంట్ చేశారు.బాలకృష్ణ గారితో కలిసి నేను డాన్సులు చేయకపోవడంతో మీకు అలా అనిపించొచ్చు కానీ ఈ సినిమాలో బాలయ్య తర్వాత నా పాత్రకి అధిక ప్రాధాన్యత ఉంటుంది అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.