జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవల ప్రచార కార్యక్రమాలలో భాగంగా సీనియర్ నటుడు ఎన్టీఆర్( Sr NTR ) గురించి ప్రస్తావిస్తూ కృష్ణ( Krishna ) గారిని అవమానకరంగా మాట్లాడారు.ఇలా కృష్ణ గారిని తక్కువ చేసి ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఈయన తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నటుడు వీకే నరేష్( VK Naresh ) స్పందించారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త బాధాకరంగా ఉన్నాయని తెలిపారు.
కృష్ణ గారు రాజకీయాలలో కొనసాగిన కూడా ఆయన ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని తెలిపారు.ఆయన మనసు చాలా మంచిదని నరేష్ తెలిపారు.రాజకీయాల పరంగా కృష్ణ గారు ఎప్పుడు కూడా పొత్తులు మారలేదని తెలిపారు.ఆయన సినిమా ఇండస్ట్రీకి అలాగే రాజకీయా రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని నరేష్ వెల్లడించారు.
కృష్ణ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించిన దాఖలాలు కూడా లేవని ఈయన వెల్లడించారు.
అలా ఎంతో మంచి మనస్తత్వం ఉన్నటువంటి కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ మాటలు బాధాకరంగా అనిపించాయని ఈయన తెలిపారు.ఇక పవన్ గురించి మాట్లాడుతూ.ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గెలవాలని అలాగే కూటమి కూడా గెలిచి ఆంధ్రప్రదేశ్ తిరిగి మునపటిలా మళ్లీ వెలుగులు వెలగాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా నరేష్ కూటమి గెలుపు కోరుకున్నారు.
ఇక ఎవరూ కూడా కృష్ణ గారి పేరును అనవసరంగా రాజకీయాలలోకి లాగ వద్దని తెలిపారు.అయితే పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం కృష్ణ గారిని కించపరిచే విధంగా ఆయన స్థాయిని తగ్గించే విధంగా లేవని పవన్ కళ్యాణ్ అభిమానులు నరేష్ కామెంట్లపై స్పందిస్తున్నారు.