కరోనా తర్వాత ఒక ఏడాది పాటు తగ్గిన సినిమా జోరు మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది.ఇక 2023వ సంవత్సరానికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో సినిమా పండగ జరుగుతుంది.
ఈ సంవత్సరం మొదటి మూడు నెలలు పూర్తి చేసుకున్న సినిమా పరిశ్రమ బాగానే విజయాలను నమోదు చేసుకుంది.చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ఈ ఏడాది మంచి సినిమాలు విడుదలై ఘనవిజయ సాధిస్తున్నాయి.
ఇప్పటికే అనేక సినిమాలు ఓటీటీ మరియు థియేటర్లో విడుదలయి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.అయితే మొదటి మూడు నెలల సమయంలో ఏకంగా తొమ్మిది మంచి విజయాలు నమోదు అయ్యాయి.
దీన్ని బట్టి చూస్తే ప్రతి నెలా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తున్నట్టే.
సంక్రాంతితో మొదలైన ఈ సినిమా జాతర వీర సింహారెడ్డి( Veera Simha Reddy ) తో మొదలయింది.ఆ తర్వాత వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) కూడా ఒక రోజు తేడాతో విడుదలై మంచి విజయాలను సాధించాయి.వాల్తేరు వీరయ్య చిత్రం ఏకంగా 200 కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్స్ కాబట్టి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక వారసుడు( Varasudu ) సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించినట్టే గణాంకాలు చెబుతున్నాయి.జనవరిలో ఈ మూడు విజయాలు టాలీవుడ్ కి మంచి కిక్కునివ్వగా, ఫిబ్రవరిలో కలర్ ఫోటో( Color photo ) ఫేమ్ సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మ భూషణ్( Writer Padma Bhushan ) కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఇక తమిళ హీరో ధనుష్ నటించిన సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది.ఈ చిత్రం తెలుగులో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇది గట్టి విజయాన్ని అందుకుంది.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం తో ఫిబ్రవరి మాసం ముగించగా ఈ చిత్రం కూడా పరవాలేదనిపించింది.బ్రేక్ ఈవెన్ దాటినట్టుగానే తెలుస్తుంది.
ఇక మార్చి విషయానికొచ్చేసరికి బలగం( Balagam ) సినిమా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.మార్చి మొదటి వారంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.అతి చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న చిత్రంగా బలగం పేరు చెప్పుకోవచ్చు.ఇక మార్చి చివర ఆఖరికి వచ్చేసరికి దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ) కూడా బ్రహ్మాండమైన వసూళ్లు రాబట్టి క్లీన్ హిట్ అనిపించింది.
మార్చి చివరి వారాంతంలో వచ్చిన దసరా( Dussehra ) సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు.నాని కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం రికార్డ్ సృష్టించింది.49 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఏకంగా మొదటి ఐదు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఈ లెక్కల ప్రకారం మొదటి మూడు నెలల్లో ఏకంగా తొమ్మిది విజయాలు సాధించి టాలీవుడ్ సర్కిల్ లో సంతోషాన్ని నింపింది.