ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే వ‌ద్ద‌న్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరగాలని దాదాపు అమ్మాయిలందరూ కోరుకుంటారు.కానీ పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులు, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వాడటం తదితర అంశాలు తమ కోరికకు అడ్డంకిగా నిలుస్తుంటాయి.

 Follow This Simple Remedy To Make Your Hair Grow Thicker , Simple Remedy, Hair G-TeluguStop.com

దాంతో ఏమి చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే కనుక మీరు వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, మూడు టేబుల్ స్పూన్ల‌ మందారం పొడి, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో ఒక ఫుల్ ఎగ్‌, వ‌న్‌ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి షవర్ క్యాప్ ను ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Pack, Latest, Long, Simple Remedy, Thick-Telugu Health T

వారంలో రెండు సార్లు ఈ రెమెడీని గనుక పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.

జుట్టు చిట్లడం, పొట్లిపోవ‌డం, విరిగి పోవ‌డం వంటి సమస్యలు దూరం అవుతాయి.చుండ్రు స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ సింపుల్ అండ్ న్యాచుర‌ల్ హోం రెమెడీని ప్ర‌య‌త్నించండి.ఒత్తైన కురుల‌ను మీసొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube