తెలంగాణలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే సహించేది లేదన్న డీజీపీ రవిగుప్తా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా కేసులు పెడతామని తెలిపారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.