ప్రెజర్ కుక్కర్‌లో కాఫీ తయారుచేసిన వ్యక్తి.. వీడియో చూస్తే..

ఇంట్లో కాఫీ( Coffee ) తయారు చేసేటప్పుడు అందరికీ ఓ పెద్ద తలనొప్పి ఉంటుంది.చాలామందికి కాఫీ కేఫ్‌లో లాగా కుదరదు.

 A Person Who Made Coffee In A Pressure Cooker.. If You Watch The Video,viral New-TeluguStop.com

పాల మీద నున్న ఆ నురగ ఎలా వస్తుంది? ఖరీదైన కాఫీ కొనే బదులు, ఇంట్లోనే ఉన్న వస్తువులతో అలాంటి టేస్ట్ ఎలా సాధించవచ్చు? అని చాలామంది అనుకుంటూ ఉంటారు.అయితే కొంతమంది ఇలా టేస్టీగా కాఫీ తయారు చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ కనిపెడుతుంటారు.

ఇలాంటి పనులనే “జుగాడ్‌( Jugaad )” అంటారు.ఇటీవలే సోషల్ మీడియాలో ఇలాంటి జుగాడ్‌ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక వీధి వ్యాపారి కాఫీ తయారు చేస్తున్నాడు.పాలు, కాఫీ, చక్కెర – అన్నీ కలిపి ఒక స్టీల్ గ్లాస్‌లో వేసి, తరువాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు.ఆయన వద్ద ప్రెజర్ కుక్కర్ ఉంది.దానికి పైపు, వాల్వ్‌తో చేసిన ఓ అటాచ్‌మెంట్ ఉంది.ఈ పైపు నుంచి ఆవిరి వెలువడుతుంది.ఆ పైపును ఆయన కాఫీ ఉన్న గ్లాస్‌లోకి ముంచి, ఆవిరి పాలతో కలిసేలా చేస్తాడు.

ఇలా చేయడం వల్ల పాల మీద నురగా వచ్చి, చాలా క్రీమీగా ఉండే కాఫీ తయారు అవుతుంది.చివరిగా ఆ నురగతో ఉన్న కాఫీని వీడియో తీస్తున్న వ్యక్తికి అందిస్తాడు.

ఆ వీడియోకు చాలా తక్కువ సమయంలోనే 73,000 దాకా లైకులు పడ్డాయంటే నమ్మొచ్చు? కామెంట్స్ సెక్షన్‌లో అయితే అందరూ ఈ కొత్త వీడియా గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు.కొంతమంది ఈ ఇండియన్ ఇన్నోవేషన్ చూసి గర్వపడుతున్నారు.మరికొంతమంది ఇది కాఫీ షాపుల్లో వాడే పద్ధతిలానే ఉందని, కానీ ఇందులో అంత షో ఉండదని చెప్తున్నారు.కొందరు మాత్రం, ప్రెజర్ కుక్కర్‌( Pressure Cooker )తో ఇలాంటి పనులు చేయడం చాలా వింతగా ఉందని పేర్కొన్నారు.

ఇక పిజ్జా కోసం ఇలాంటి క్రియేటివ్ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుందని ఇంకొకరు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube