తెలంగాణలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటేశారు.
హైదరాబాద్( Hyderabad ) లోని నందినగర్ లో కుటుంబ సమేతంగా కేటీఆర్( KTR ) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆమన మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
మన బాధ్యతను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలోనే రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు.