తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) తమ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని తెలిపారు.
ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బీజేపీ( BJP )కి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.
ఈ క్రమంలోనే బీజేపీ 200 సీట్లు కూడా రావని చెప్పారు.అలాగే తాము మోదీని అవమానించడం లేదని స్పష్టం చేశారు.
అనంతరం ప్రజాస్వామ్య రక్షణలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలను పోషించాలన్న సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.