లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

కిచెన్లో దొరికే మసాలా దినుసులలో లవంగం ఒకటి.లవంగాన్ని ఎక్కువగా కూరల్లో, బిర్యానీలలో వాడుతారు.

 Do You Know The Benefits Of Cloves ,cloves ,benefits Of Cloves,health Benefits,c-TeluguStop.com

లవంగం వల్ల కూరకు రుచి పెరుగుతుంది.అయితే లవంగం వల్ల రుచి పెరగడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అందువలనే లవంగాలను మసాలా కర్రీలు, నాన్ వెజ్ కూరలు, బిర్యానీలలో ఉపయోగిస్తూ ఉంటారు.అయినప్పటికీ చాలామందికి లవంగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అస్సలు తెలిసి ఉండవు.

అయితే లవంగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు నివారణ కోసం లవంగాలను తీసుకుంటూ ఉంటారు.

అయితే లవంగాల వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.లవంగాలను తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించవచ్చు.అదేవిధంగా డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.చాలామంది లవంగాలను సుగంధ ద్రవ్యాలుగా, మసాలా దినుసులుగా మాత్రమే ఉపయోగిస్తారు.

కానీ లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మ్యాంగనీస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Telugu Bad Breath, Benefits, Cough, Problems, Diabetes, Gum Problems, Tips, Lung

ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే భోజనం చేసిన తర్వాత తరచూ లవంగాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.ఇలా భోజనం తిన్నాక లవంగాలను తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసి ప్రేగులు శుభ్రపడతాయి.

అలాగే కడుపులో ఉండే సూక్ష్మజీవులు నుండి హాని కలిగించే క్రిములు అలాగే ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుంది.అలాగే లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా నివారించవచ్చు.

కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Telugu Bad Breath, Benefits, Cough, Problems, Diabetes, Gum Problems, Tips, Lung

అదేవిధంగా దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు లవంగం వేసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అదేవిధంగా కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాలు తీసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే లవంగాలు అల్సర్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

అందుకే రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube