పీరియడ్స్ సమయంలో బొప్పాయి పండు తినవచ్చా? అసలు నిజం ఏమిటంటే..

మహిళలకు జీవితంలో నెలసరి అనేది ఒక సవాలు లాంటిది.పీరియడ్( period ) సమయంలో పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్, వాంతులు, వికారం ఇలాంటి ఎన్నో సమస్యలు మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.

 Can Papaya Be Eaten During Periods The Real Truth Is , Papaya, Periods ,papaya F-TeluguStop.com

ఇక మరికొందరికి పీరియడ్ సమయంలో విపరీతమైన ఆకలి కూడా ఉంటుంది.మరికొందరికి అసలేం తినాలి ఉండదు.

అయితే పీరియడ్ సమయంలో డైట్ చాలా ముఖ్యమైనది కొన్ని ఆహారాలు పీరియడ్స్ సమయంలో తినవచ్చా తినకూడదని ఎన్నో సందేహాలు ఉంటాయి.

అయితే కొన్ని ఆహారాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మరికొన్ని పదార్థాలు నొప్పినీ తీవ్రం చేస్తుంటాయి.అందుకే పీరియడ్స్ అలాగే గర్భధారణ సమయంలో బొప్పాయి పండు( Papaya fruit )కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు.

అయితే గర్భధారణ సమయంలో పండిన బొప్పాయి తినడం ఆరోగ్యకరమైనదే.కానీ పచ్చి బొప్పాయి మాత్రం అసలు తినకూడదు.

ఎందుకంటే పచ్చి బొప్పాయి లో రబ్బరు పాలు, పాపైన్ అధికంగా ఉంటాయి.ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించడం ద్వారా తీవ్రమైన అలర్జీ, ప్రతిచర్యలు ప్రారంభ ప్రసవ నొప్పిని ప్రేరేపిస్తుంది.

Telugu Tips, Papaya, Papaya Fruit, Periods-Telugu Health

అయితే బొప్పాయి పండును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే పీరియడ్ సమయంలో బొప్పాయి తినాలా? వద్దా? అన్న సందేహం ప్రతి ఒక్కరికి మహిళకి ఉంటుంది.బొప్పాయి వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.ఇది శరీరంలో అధిక వేడిని కలిగిస్తుంది.అంతేకాకుండా పిండం, ఋతుస్రావం రెండింటిని కూడా భంగపరుస్తుంది.దీన్ని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఎన్నో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Telugu Tips, Papaya, Papaya Fruit, Periods-Telugu Health

అయినప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్ సమయంలో బొప్పాయి పండు తినడం సురక్షితమే.ఒక రకంగా ప్రయోజనకరంగా కూడా ఉంటుందని వారు చెబుతున్నారు.ఎందుకంటే బొప్పాయి పండు శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.అంతేకాకుండా రుతుస్రావాన్ని మెరుగుపరుస్తుంది.ఉబ్బరం, మలబద్దకం ఇలాంటి సమస్యలను కూడా నివారిస్తుంది.అయినప్పటికీ కూడా దీన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube