జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ( Anasuya ) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఈ సక్సెస్ కారణంగానే సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు.
అనసూయ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే కొన్నిసార్లు ఈమె వస్త్రధారణ వ్యవహార శైలి బట్టి నేటిజన్స్ భారీ స్థాయిలో తనని ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఆమె దుస్తులను బట్టి తన క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేస్తూ కామెంట్లు చేయడంతో అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు.
ఇలా పలు సందర్భాలలో ఈమె అభిమానులతో పెద్ద ఎత్తున వాదనకు దిగారు.అనసూయ ఇలాంటి వాటికే రియాక్ట్ కాకపోతే మంచిది కదా అంటూ చాలామంది కామెంట్లు( Comments ) చేస్తూ ఉంటారు అయితే అనసూయ డ్రస్సులను బట్టి తన క్యారెక్టర్ డిసైడ్ చేసే వారి గురించి ఆది చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక అనసూయ ఆది మధ్య ఎంతో మంచి అనుబంధ ఉందని చెప్పాలి.
ఆది జబర్దస్త్ లో చేసే స్కిట్లలో అనసూయ పాల్గొంటూ సందడి చేసేవారు.
ఇలా అనసూయతో ఉన్నటువంటి మంచి అనుబంధం కారణంగా హైపర్ ఆది( Hyper Aadi ) ఈ విషయం గురించి మాట్లాడుతూ.అనసూయ డ్రెస్( Anasuya Dress )ని బట్టి ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంటారు.ఆమెపై దారుణంగా ట్రోల్స్( Trolls ) చేస్తుంటారు.
కానీ అనసూయ వ్యక్తిగతంగా చాలా స్ట్రిక్ట్ అని, అలాంటి విషయాలకు దూరంగా ఉంటుందని, ఏ పరిధిలో ఉండాలో ఆమెకి బాగా తెలుసని తెలిపారు.ఇక ఆమెతో చనువుగా ఉండడం అంత ఈజీ కాదని ఆమె ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుందని కాస్త చనువు తీసుకుంటే వారిని అక్కడే కట్ చేస్తుందని ఈ విషయంలో అనసూయ చాలా స్ట్రిక్ట్ అని ఆది తెలిపారు.
ఇలాంటి విషయాలలో అనసూయ చాలా హుందాగా ప్రవర్తిస్తుందంటూ ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.