చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించబోతుంది.ఇప్పటికే దాదాపుగా 30 దేశాల్లో కరోనా వైరస్ బయట పడింది.
చైనాలో వేలాది మంది మృతి చెందగా బయట దేశాల్లో ఇంకా మృతుల సంఖ్య ప్రమాద స్థాయికి రాలేదు.చైనాలో అత్యంత స్పీడ్‌గా ఈ కరోనా వైరస్ విస్తరిస్తుంది.
ఈ వైరస్‌ను కనుగొన్న సమయంలో చైనాకు చెందిన ఒక వ్యక్తి ఈ చార్ట్‌ను ప్రిపేర్ చేయడం జరిగిందట.ఈ చార్ట్ ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనుకున్నారు.
శాస్త్రవేత్తల అంచనాలను కూడా తిప్పి కొట్టి కరోనా విజృభిస్తుంది.ఆ చాట్‌లో ఉన్న దానికి రెట్టింపు స్థాయిలో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థం అవుతుంది.
ఆ చార్ట్ ప్రకారం 2020 సెప్టెంబర్ వరకు దాదాపుగా 23 కోట్ల మంది కరోనా వైరస్ వల్ల మరణిస్తారట.ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ఈ చార్ట్ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంది.
చైనాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఈ వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ లెక్క మించి ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చాట్‌ను కొందరు కొట్టి పారేస్తున్నారు.ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని కరోనా వైరస్‌ను అరికట్టేందుకు.వ్యాప్తి చెందుకుండా ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక వేళ కరోనాను వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోకుంటే మరియు మందు ఏది కనిపెట్టకుండా ఉంటే ఆ చార్ట్ నిజం అయ్యే అవకాశం ఉంది.
కాని ఖచ్చితంగా ఆ స్థాయిలో మాత్రం వ్యాప్తి చెందదు అని, ఇప్పటికే కరోనాకు విరుగుడును కనిపెట్టారని, దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలంటే మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని, అప్పటి వరకు కొన్ని ఎన్నిక మరణాలే సంభవించే అవకాశం ఉంది.కాని మరణాల సంఖ్య వేల నుండి లక్షలకు మాత్రం వెళ్లదంటూ శాస్త్రవేత్తలు మరియు వైధ్యులు ధీమాగా చెబుతున్నారు.సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పుకార్లకు భయపడి ఆందోళన చెందనక్కర్లేదు అంటున్నారు.