మంచు లక్ష్మి( Manchu Lakshmi ) పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు( Mohan Babu ) వారసురాలుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి మంచు లక్ష్మీ ప్రస్తుతం వరస టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటిగా నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు.అయితే ఈమెకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె ముంబైలోనే నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ముంబైలో ఉన్నటువంటి మంచు లక్ష్మి తరచూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇటీవల కాలంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా మంచి లక్ష్మి చేసే గ్లామర్ షో మామూలుగా ఉండడం లేదని చెప్పాలి.
ఈమె ఫోటోలు చూసిన అభిమానులందరూ షాక్ అవుతున్నారు.
ఇదివరకు ఎప్పుడూ కూడా మంచు లక్ష్మిని ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ చూసిన దాఖలాలు లేవు ముంబై వెళ్ళగానే బాలీవుడ్ నీళ్లు అక్కకు బాగా పట్టాయి అందుకే ఇలా గ్లామర్ షో చేస్తున్నారు అంటూ పలువురు ఈమె గ్లామరస్ ఫోటోల పై కామెంట్ చేస్తుంటారు.అయితే ఇటీవల కాలంలో మంచు లక్ష్మి తన శరీరం పై ఉన్నటువంటి టాటూ( Tattoo ) లను వాటి అర్థాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కానీ ఇటీవల కాలంలో మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తే తన రెండు చేతుల భుజం పై భాగంలోనూ అలాగే ఎద భాగాల మధ్యలో సరికొత్త టాటూ వేయించుకున్నారు.ఇలా ఒంటి నిండా టాటూలతో మంచు లక్ష్మి కనిపించేసరికి ఈమె వేయించుకున్న ఈ టాటూల వెనక అర్థమేంటని అందరూ తెగ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మంచు లక్ష్మి ఇటీవల కాలంలో వేయించుకున్న ఈ టాటూల వెనుక చాలా అర్థం ఉందని తెలుస్తుంది.ఇది నాగ టాటూ( Naga Tattoo ) అట.ఓ గిరిజన సంస్కృతిని గౌరవిస్తూ ఆమె ఈ టాటూ వేయించుకున్నట్టు తెలుస్తుంది.మో నాగ అనే ఆర్టిస్ట్ తో మంచు లక్ష్మీ ఈ టాటూ వేయించుకుందట.
ముంబైలో ఈ టాటూ వేయించుకోవడం కోసం నాలుగు గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.జాలి, దయ, కరుణ వంటి వాటిని కలిగి ఉండే ధైర్యవంతురాలు అనే అర్ధాన్ని ఈ టాటూ సూచిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈమె వీపు వెనుక భాగాన అలాగే భుజంపై కూడా ఇంతకుముందు టాటూలు ఉండేవి కానీ తాజాగా మరోసారి మూడు టాటూలు వేయించుకోవడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.