తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) మరో సవాల్ విసిరారు.రేపు అమరవీరుల స్థూపం దగ్గరకు రాజీనామా లేఖను( Resignation Letter ) తీసుకొస్తానన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖను తీసుకొని వస్తారా అని ప్రశ్నించారు.
ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడదామని హరీశ్ రావు తెలిపారు.
ఆగస్ట్ 15వ తేదీలోగా ఆరు గ్యారెంటీలను, రైతు రుణమాఫీని అమలు చేస్తే తన రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్ కు ఇస్తానని వెల్లడించారు.
ఒకవేళ ఆగస్ట్ 15 లోపు గ్యారెంటీలను, రుణమాఫీని అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామాను గవర్నర్ కు ఇస్తారని పేర్కొన్నారు.ఈ క్రమంలో రేపు తప్పనిసరిగా రాజీనామా లేఖను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి రావాలని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.







