కాలిఫోర్నియా జైన్ దేవాలయంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి పూజలు

యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ( Donald Lu ) బుధవారం కాలిఫోర్నియాలోని జైన్ ఆలయాన్ని సందర్శించి ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలకు భారతీయ అమెరికన్లు వెన్నెముక అని నొక్కి చెప్పారు.యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ , యూఎస్‌లోని జైన్ కమ్యూనిటీ మధ్య బలమైన అవగాహనను పెంపొందించాలని ఈ చొరవ లక్ష్యంగా పెట్టుకుంది.

 Us State Dept Official Visits Jain Temple In California , Donald Lu, California,-TeluguStop.com

ఈ పర్యటన సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సమీర్ షా, మహేశ్ వాదిర్( Sameer Shah, Mahesh Wadir ), ఆలయ కార్యనిర్వాహక బృందం .జైనమతం , దాని ఆహార పద్ధతులు, అహింస తత్వశాస్త్రం, శాంతి, కరుణ, అహింస లార్డ్ మహావీర్ సందేశం, జైన ఉపవాస సంప్రదాయాల గురించి అమూల్యమైన సందేశాన్ని అందుకున్నారు.అంతేకాకుండా.అమెరికాలోని ఇతర ప్రాంతాలు, భారత్, నైజీరియాలోని వ్యక్తులకు మద్ధతు ఇవ్వడానికి జైన దేవాలయం ద్వారా నిర్వహించబడుతున్న కమ్యూనిటీ ఔట్రీచ్ , దాతృత్వ కార్యక్రమాలపై సలహాలను పంచుకున్నారు.

Telugu Ajay Bhutoria, Calinia, Donald Lu, India America, Jain Temple, Mahesh Wad

దక్షిణ కాలిఫోర్నియాలోని జైన దేవాలయం( Jain temple ) ఈ ప్రాంతంలోని జైన సమాజానికి ఆధ్యాత్మిక , సాంస్కృతిక కేంద్రంగా వుంది.ఆలయంలో ఆరాధన, అభ్యాసం, సమాజ సేవ నిత్యం జరుగుతోంది.జైన్ తేరాపంత్ శాఖ ఆచార్య మహాశర్మన్ జీ ప్రారంభించిన అనువృత్ డిజిటల్ ప్రోగ్రామ్‌పై అజయ్ భూటోరియా ( Ajay Bhutoria )వివరాలు అందజేశారు.మానసిక ఆరోగ్యానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి స్టేట్ డిపార్ట్‌మెంట్ కార్యక్రమాలలో డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్‌ను ఏకీకృతం చేయడాన్ని పరిగణించాలని లూను అజయ్ కోరారు.

అంతేకాకుండా భారతదేశంలో విజిటర్ వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యానికి సంబంధించిన ఆందోళనలను కూడా జైన్ కమ్యూనిటీ లూ దృష్టికి తీసుకొచ్చింది.అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ మాట్లాడుతూ.జైన్ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.భారత్-అమెరికా( India-America ) మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను ఆయన ప్రశంసించారు.

Telugu Ajay Bhutoria, Calinia, Donald Lu, India America, Jain Temple, Mahesh Wad

కాగా.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( President Joe Biden ) ఆయన సతీమణి ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) మహావీర్ జయంతి సందర్భంగా జైన మతస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు వారు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.మహావీరుడి జయంతిని ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకుంది.ఆయన తన బోధనల ద్వారా శాంతి, సామరస్యాన్ని వ్యాప్తి చేశారు.మహావీర్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రార్థనలు చేయడం, ఊరేగింపులు, మహావీరుడిని ఆరాధించే శ్లోకాలు పాడటం, శరీరం ఆత్మను శుద్ధి చేయడానికి ఉపవాసం చేయడం, దాతృత్వం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు వంటి ఆచారాలను నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube