దేవదాసు సినిమా( Devadasu ) ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఇలియానా ( Ileana ) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇటీవల ఈమె కుమారుడికి జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.
తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నటువంటి ఇలియానా ఇటీవల నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా( Do Aur Do Pyaar ) విడుదల అయింది.ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.ఈ చిత్రంలో ఇలియానా నోరా అనే పాత్రలో నటించింది.ఈ పాత్ర తన రియల్ లైఫ్( Real Life ) కి చాలా దగ్గరగా ఉంటుందట.
నోరా లాగే నేను కూడా చాలా సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది.నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి ఉండాలని చాలా సార్లు కోరుకున్నా.ఈ చిత్ర దర్శకురాలు శిరీష( Director Sirisha ) కథ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నా.ఎందుకంటే ఈ పాత్ర నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది.
ఇక ఈ సినిమాలో నటించాలి అంటే వర్కౌట్స్ చేస్తూ శరీర బరువు తగ్గాలని చాలా భయపడ్డాను.ఎందుకంటే నేను ఇప్పుడు మానసికంగా అలసిపోయి ఉన్నాను.కాబట్టి వర్కౌట్స్( Workouts ) చేసి నా బాడీని మార్చుకునే ఓపిక నాకు లేదు.బరువు తగ్గడం నా వల్ల కాదు అని శిరీషకి చెప్పేశా.ఆమె బరువు తగ్గమని ఎవరు చెప్పారు.నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే నటించు అంటూ తెలియచేశారు.
అయితే ఇలా తన జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈమె అలసిపోయాను ప్రేమించే వ్యక్తి కావాలి అంటూ ఎందుకు మాట్లాడారా అన్న సందేహాలు కూడా అందరిని వెంటాడుతున్నాయి.