మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు( Raghunandan Rao )కు మద్ధతుగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మోదీని మళ్లీ ప్రధానిని చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని అమిత్ షా( Amit Shah ) కోరారు.అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్నారు.
కేసులను గెలిచి మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్ట చేశారన్నారు.దేశంలో అనేక సమస్యలను పరిష్కరించామన్న ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS, Congress )ఒక్కటేనని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతిని ప్రోత్సహించాయని ఆరోపించారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం రిజర్వేషన్ తెచ్చాయన్నారు.
ఈ క్రమంలో తాము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు.బీజేపీతో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మెదక్ లో అభ్యర్థి రఘునందన్ ను గెలిపించాలని కోరారు.








