మహానటి సావిత్రి అంతటి నటి అంటూ చాల మంది ఆమెను పొంగుతూ ఉంటారు.మహానటి సినిమా కోసం సైతం తొలుత ఆమెనే హీరోయిన్ అని ఫిక్స్ అయినా కొన్ని కారణాల చేత ఆమెను కాదని కీర్తి సురేష్ ని తీసుకున్నారు.
నిత్య మీనన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టి హీరోయిన్ గా మలయాళం మరియు కన్నడ సినీ పరిశ్రమలో తొలిసారి నటించింది.ఆ తర్వాత తెలుగు లో 2011 లో ఆలా మొదలయింది అనే చిత్రంలో హీరోయిన్ గా వచ్చింది.
నటిగా ఆమె కెరీర్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి తెలుగు తో పాటు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ మరియు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి మారె హీరోయిన్ కి సాధ్యం కానీ ఎన్నో పాత్రలు పోషించింది.ఇక నిత్య మీనన్ కి వయసుతో సంబంధం లేకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో చేయడం లో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.అందుకు ఉదాహరణ మళ్లి మళ్లి ఇది రాని రోజు చిత్రం.ఈ సినిమాలో తనతో సమానమైన వయసు ఉన్న అమ్మాయికి తల్లిగా నటించింది.అలా నటించడం చాల మంది హీరోయిన్స్ వల్ల ఖచ్చితంగా కాదు.కేవలం ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ మధ్య జరిగిన సంభాషణలతో మాత్రమే హిట్ అయ్యింది.
అలాంటి ఒక పాత్ర ఆఫర్ చేస్తే 90 శాతమే మంది హీరోయిన్స్ నో చెప్తారు.
అందుకే ఆమె మహానటి తో పోల్చబడుతుంది.పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం లో నిత్య మీనన్ దిట్ట అనే చెప్పాలి.పైగా మనసులో ఏది పెట్టుకోకుండా జెన్యూన్ గా మాట్లాడుతుంది అనే పేరు కూడా నిత్య మీనన్ కి దక్కింది.
నిత్య మీనన్ నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది.చాల మంది ఆమె లావుగా ఉంటుంది అని కామెంట్స్ చేసిన నిత్య ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోదు.
పైగా ట్రోలర్స్ కి గట్టిగా సమాధానం చెప్పడం లో కూడా ఆమె ఎప్పుడు ముందుగానే ఉంటుంది.ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ లో చివరగా తెలుగు లో కనిపించిన నిత్య మీనన్ వేరు వేరు భాషల్లో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.
ఇక తెలుగు లో కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఇది అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది.