అమ్మో ఒకటో తారీకు అంటూ టిడిపి( TDP ) మళ్ళీ టెన్షన్ పడుతోంది.ఈనెల ఒకటో తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఏపీ ప్రభుత్వం అందించే పెన్షన్( Pension ) సరేనా సమయంలో అందకపోవడం, పెన్షన్ తీసుకునేందుకు వారు అనేక ఇబ్బందులు పడడం వంటివన్నీ తెలుగుదేశం పార్టీ పై జనాల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి.
టిడిపికి అనుకూల వ్యక్తిగా ముద్రపడిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు అందకుండా చేయించారు అనే ఆగ్రహం కనిపించింది.మళ్ళీ ఇప్పుడు ఒకటో తారీకు రాబోతోంది.
ఈనెల కూడా పెన్షన్ ఇంటి వద్దకు ఇవ్వకపోతే.త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమకు ఇబ్బందులు తెచ్చిపెడతాయనే ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది.
ఈ నెల పింఛన్ పంపిణీ ఆలస్యం కావడంతో, గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేయడంతో, చాలామంది వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ కు( Election Commission ) టిడిపి ఇచ్చిన ఫిర్యాదుతోనే పింఛన్ ను వాలంటీర్లు( Volunteers ) ఇంటి వద్దకు వచ్చి అందించలేదనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లడం, కొంతమంది పెన్షన్ తీసుకునే క్రమంలో ఎండవేడికి తాళలేక మరణించడం, అనేకమంది వడదెబ్బకు గురవడం వంటివన్నీ టీడీపీకి డామేజ్ తీసుకువచ్చాయి.వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు పింఛన్ అందించేవారు.కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు వెలబడ్డాయి.
టిడిపి ప్రోద్బలంతోనే నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) పిటిషన్ వేశారనే ప్రచారం జనాల్లోకి విస్తృతంగా వెళ్ళింది.దీంతో వెంటనే తేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.పెన్షన్ ఇంటి వద్దకే అధికారుల ద్వారా అందించాలని కోరారు.
అయితే మార్చి ఆఖరు కావడం, బ్యాంకులకు సెలవులు ఉండటంతో పెన్షన్ తీసుకోవడం ఆలస్యం అయిందని అధికారులు వివరణ ఇచ్చారు.ఇప్పుడు మే ఒకటో తేదీ వస్తుంది.మే 13న పోలింగ్ జరగబోతోంది.ఈనెల పెన్షన్ పంపిణీ ఆలస్యం అయితే అది టిడిపికి మరింత డామేజ్ చేస్తుందనే ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది .అందుకే ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. ఇంటి వద్దనే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
మే 1 వ తేదీ కి సక్రమంగా పెన్షన్ పంపిణీ జరిగితే సరే, లేకపోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో టిడిపి పై తీవ్రంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.