చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్( Itel ) రూ.10 వేల బడ్జెట్ లో భారత మార్కెట్ లో అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉండే బెస్ట్ ఫోన్ గా దీన్ని చెప్పుకోవచ్చు.ఈ ఫోన్ లో ఉండే అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఐటెల్ S24 స్మార్ట్ ఫోన్:( Itel S24 ) ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ ప్లే తో వస్తోంది.720*1612 పిక్సెల్ రిజల్యూషన్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13( Android 13 ) ఆధారిత OS పై పని చేస్తుంది.
మీడియా టెక్ హీలియా G91 SoC ప్రాసెసర్ తో ఉంటుంది.
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉంటుంది.ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.108 మెగా పిక్సెల్ తో కూడిన రెయిర్ కెమెరాతో ఉంటుంది.ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా సెటప్ తో రౌండ్ షేప్ లో ఉంటుంది.
ఐటెల్ S24 స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది.ఈ ఫోన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.ఈ ఫోన్ పై ఒక ప్రత్యేక ఆఫర్ కూడా ఉంది.ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.999 విలువగల ఐటెల్ 42 స్మార్ట్ వాచ్ ను ఉచితంగా పొందవచ్చు.