ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల( Lok Sabha Elections ) కోలాహలం నెలకొంది.మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలు దశలు పూర్తయ్యాయి.
ప్రధాన పార్టీల తరపున కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు.మరోవైపు సొంతదేశంలో ఎన్నికల సందడితో ఎన్నారైలు( NRIs ) సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తున్నారు.
ప్రధానంగా కేరళ( Kerala ) నుంచి విదేశాలకు వెళ్లినవారిలో వేల మంది భారత్‌కు వస్తున్నారు.ఇందుకోసం అసవరమైతే ప్రత్యేక విమానాలను సైతం ఆశ్రయిస్తున్నారు.
గడిచిన కొద్దిరోజుల్లోనే ఏకంగా 22 వేల మందికి పైగా కేరళకు వచ్చినట్లు అంచనా.పోలింగ్ నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేరళలో రేపు 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

కేరళలలో ఏ ఎన్నిక జరిగినా ప్రవాస భారతీయులను రాష్ట్రానికి రప్పించడానికి రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ వుంటాయి.తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు దేశాల్లో స్థిరపడిన కేరళ వాసులను తీసుకొచ్చేందుకు 12 ఛార్టెర్డ్ విమానాలను ఏర్పాటు చేశారు.ట్రావెల్ ఏజెన్సీలతో ప్రత్యేక చొరవ తీసుకుని విమాన టికెట్లలో రాయితీలు( Flight Tickets Discount ) కూడా కల్పిస్తున్నారు.
కొందరికైతే రాజకీయ పార్టీలు ఉచితంగా విమాన టికెట్లను సైతం సమకూరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.పలు దేశాల్లో ఉన్న ప్రవాస మలయాళీలను ఎన్నికల తంతులో భాగం చేసేందుకు గాను రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేస్తున్నాయి.
యూడీఎఫ్ నేత షపీ పరంబిల్( Shafi Parambil ) గల్ఫ్ దేశాల్లో ప్రచారం నిర్వహించారు.ఈయన వటకర స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు.

ఇదిలావుండగా.దేశంలో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.ఖండాంతరాల్లో పనిచేస్తున్నప్పటికీ ఓటు హక్కు( Right To Vote ) వినియోగించుకునేందుకు మలయాళీలు ఉత్సాహం చూపిస్తూ వుంటారు.కేరళ ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.రాష్ట్రంలో ప్రవాస భారతీయ ఓటర్లు 89,839 మంది.కోజికోడ్ 36 వేల మంది, మలప్పురం 13 వేలు, కన్నూర్ 13 వేలు, పాలక్కాడ్, వయనాడ్, వడకర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య ఎక్కువగా వుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఆయా పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.







