కృష్ణా జిల్లా గుడివాడ( Gudivada ) నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని( Kodali Nani ) నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోసారి గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ( YCP ) జెండా ఎగురుతుందని కొడాలి నాని తెలిపారు.ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో తామున్నామని పేర్కొన్నారు.

అయితే అక్కడక్కడ టీడీపీ( TDP ) వాళ్లు రెచ్చగొడుతున్నారని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు ఎన్ఆర్ఐలకు( NRI ) టీడీపీ సీట్లను అమ్ముకున్నారన్న కొడాలి నాని చంద్రబాబును నమ్ముకున్న ఎన్ఆర్ఐలకు గుణపాఠం తప్పదని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల తరువాత ఎన్ఆర్ఐలు రిటర్న్ టికెట్ తో వెళ్లిపోతారని తెలిపారు.







