వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రిలీజ్ చేసింది.
మే 2వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్( Notification ) విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్న ఈసీ 10వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది.
అదేవిధంగా మే 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది.
తరువాత మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది.
జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది.అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy ) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిందన్న సంగతి తెలిసిందే.







