మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
ఇక మొన్న దసరా పండుగ రోజు చిరు నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఆచార్య ప్లాప్ అయ్యి ఎన్ని విమర్శలు అందుకుందో.గాడ్ ఫాదర్ విజయంతో అన్ని ప్రశంసలు అందుకుంటుంది.
ఇక మెగాస్టార్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు.ఈయన నటిస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఉంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
మరి అలాంటి సినిమా నుండి తాజాగా ఒక పిక్ లీక్ అయ్యింది.
చిరు అప్పట్లో కనిపించన్నట్టు ఇప్పుడు మాస్ లుక్ లో కనిపించడం లేదు.అయితే ఈ సినిమా కోసం మళ్ళీ పాత చిరును తీసుకు రావడానికి డైరెక్టర్ బాబీ కృషి చేస్తున్నట్టు ఈ పిక్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.
మరి ఇప్పుడు లీక్ అయిన పిక్ చూస్తుంటే మెగాస్టార్ ను ఎలా చూడాలి అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారో ఇలానే కనిపిస్తున్నారు.చిరు వీరయ్య అనే పాత్రలో నటిస్తున్నాడు.
ఇది పక్కా మాస్ మసాలా సినిమా అని అర్ధం అవుతుంది.
మరి ఈ సినిమాలోని మాస్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.ఆన్ సెట్ నుండి లీక్ అయిన ఈ పిక్ చాలా క్లారిటీగానే కనిపిస్తుంది.మరి ఇంత క్లారిటీగా ఎలా లీక్ అయ్యిందో తెలియదు కానీ ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
దీంతో మెగా ఫ్యాన్స్ ఒకవైపు ఖుషీ పడుతూనే మరోవైపు సర్ప్రైజ్ పోతుంది అని బాధ పడుతున్నారు.ఇక ఈ సినిమా మెగాస్టార్ తో పాటు మాస్ రాజా కూడా నటిస్తున్నాడు.
అలాగే హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.