తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం హత్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు .ఈ యాత్ర ప్రారంభించి నేటికి 19 రోజులు అయింది.
ఈ యాత్ర ప్రారంభం నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దగ్గర నుంచి ఆ పార్టీలోని కీలక నాయకులు అందరిని టార్గెట్ చేసుకుంటూ రేవంత్ విమర్శలు చేస్తున్నారు.అంతేకాదు పాదయాత్ర నిర్వహిస్తున్న నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తో పాటు, ఆ నియోజకవర్గంలోని కీలక నాయకులపైన విమర్శలు చేస్తూ.
కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలంటూ రేవంత్ ప్రజలను కోరుతున్నారు.
రేవంత్ పాదయాత్రకు పార్టీ నాయకులు నుంచి తగిన సహకారం అందడంతో తో పాటు , ఆయన స్పీచ్ లకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలోనే స్పందన కనిపిస్తోంది.నిన్న హుస్నాబాద్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ వ్యాఖ్యానించారు.కేసీఆర్, వినోద్ ఎంపీలు అయినా… తెలంగాణ రాలే అని పొన్నం ప్రభాకర్ ఒకసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారని రేవంత్ అన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని రేవంత్ అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పైన విమర్శలు చేశారు.
బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ తో చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు.
బండి సంజయ్ గెలిచి బిజెపికి అధ్యక్షుడు అయ్యావు, తెలంగాణ తెచ్చింది ఏమీ లేదు.ఈ ప్రాంతంలో బిజెపి అభ్యర్థులకు డిపాజిట్ రాదు.గౌరెల్లి , గండేపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు.
కుర్చీ వేసుకుని గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి గాలికి వదిలేసాడు.ఫామ్ హౌస్ మందు ఎస్తుండు.
మీకు ఇష్టం లేకున్నా మీ నియోజకవర్గాన్ని మూడు మొక్కలు చేశారంటూ రేవంత్ విమర్శించారు.