టాలీవుడ్ లో ఎవరికీ తెలియని.. కొన్ని రహస్యాలు ఇవే?

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో చిత్రవిచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.సాధారణంగా సినీ నటులు వెండి తెరపై కనిపించడం గురించి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ప్రేక్షకులకు.

 Tollywood Movies Unknown Facts Details, Tollywood, Ali, Chiranjeevi, Yamaleela,-TeluguStop.com

కానీ తెరవెనుక మాత్రం ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి.ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి తెలియని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఎన్నో విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి.

ఇక ఆ విషయాలు వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు విగ్గు లేకుండా కనిపించారట.

అలా కనిపిస్తేనే పాత్ర పండుతుంది అని చెప్పడంతో చివరికి మొదటిసారి ప్రేక్షకుల ముందుకు విగ్గు లేకుండా వచ్చారు ఏఎన్నార్.

రాఘవేంద్రరావు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన అడవి దొంగ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అప్పట్నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.దీంతో ఇక రాఘవేంద్రరావు చిరంజీవిని బాబాయ్ అని పిలిచేవారట.

Telugu Allari Naresh, Anjalidevi, Chiranjeevi, Eega, Gamyam, Linga, Mohan Babu,

అలనాటి తార అంజలీదేవి మాయా రంభ అనే సినిమాలో మొదటిసారి పాట పాడి ప్రేక్షకులను అలరించిందట.

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమాలో ముందుగా సౌందర్యనీ అనుకున్నారట.కానీ సౌందర్య నో చెప్పడంతో ఇంద్రజ ఆ సినిమా చేసింది.

తరుణ్ డెబ్యూ మూవీ నువ్వే కావాలి సినిమా ఆఫర్ మొదటగా అక్కినేని హీరో సుమంత్ కి వెళ్లిందట.

కానీ అప్పటికే యువకుడు అనే సినిమాతో బిజీగా ఉన్న సుమంత్ నో చెప్పడంతో ఇక నువ్వే కావాలి సినిమా చేశాడు తరుణ్.

Telugu Allari Naresh, Anjalidevi, Chiranjeevi, Eega, Gamyam, Linga, Mohan Babu,

నాగార్జున హీరోగా టబు హీరోయిన్గా వచ్చిన నిన్నే పెళ్ళాడతా సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు రవితేజ.

ఇక గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చనిపోయే సన్నివేశం ప్రేక్షకులను హత్తుకుందట.

అయితే ఈ సినిమా షూటింగ్ అల్లరి నరేష్ బర్త్డే రోజు జరిగిందట.

లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఇటీవలి కాలంలో యాడ్స్ లో ఎంతలా కనిపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాలో ఒక షాపు యజమాని గా నటించారు.

మన్మధుడు సినిమాలో పారిస్లో వంతెన దాటేందుకు నాగార్జున భయ పడుతుండగా సోనాలి బింద్రే హెల్ప్ చేస్తుంది.

కానీ నిజానికి భయపడింది మాత్రం సోనాలి బింద్రేనట.

Telugu Allari Naresh, Anjalidevi, Chiranjeevi, Eega, Gamyam, Linga, Mohan Babu,

యాక్షన్ అడ్వెంచర్ మెరుపు దాడి సినిమా కు ముందుగా చిరంజీవి మోహన్ బాబు ని అనుకున్నారట.కానీ కథలో కొన్ని మార్పులు కోరడంతో చివరికి సుమన్, బాలచందర్ తో సినిమా తీశారు

రాజమౌళి ఈగ సినిమా లో తాగుబోతు రమేష్ క్యారెక్టర్ ను రవితేజ తో చేయించాలని అనుకున్నారట.కానీ అనుకోని కారణాలవల్ల ఇక తాగుబోతు రమేష్ ను తీసుకున్నారట.

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమగోల సినిమాలో ముందుగా బాలయ్యను హీరోగా అనుకున్నారు చదువుకుంటున్న బాలకృష్ణ వద్దని చెప్పి ఇక పాత్రను ఎన్టీఆర్ చేశారట.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు అలాగే ఉండిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube