కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్న ఆ ప్ర‌జాప్రతినిధులు.. డిమాండ్లు నెర‌వేరుస్తారా

రాజ‌కీయాలు అన్న త‌ర్వాత అనేకం జ‌రుగుతుంటాయి.ఒక‌సారి వ‌ద్దు అనుకున్న‌దే భ‌విష్య‌త్‌లో కీల‌కం అవుతుంది.

 Those Public Representatives Who Are Putting Tension On Kcr Will The Demands Be-TeluguStop.com

కాబ‌ట్టి ఏ విష‌యాన్ని కూడా అంత ఈజీగా కొట్టి పారేయొద్దు.ఎవ‌రినీ కూడా దూరం పెట్టు కోవ‌ద్దు.

ఎందుకంటే రాజ‌కీయాల్లో క‌లుపుకుపోవ‌డ‌మే చాలా ముఖ్యం.లేదంటే మ‌నుగ‌డే క‌ష్టం.

ఈ విష‌యాలు కేసీఆర్‌కు వెన్న‌తో పెట్టిన విద్య.ఆయ‌న‌కు అవ‌స‌రం అనుకుంటే ఎవ‌రిని అయినా క‌లుపుకుని పోతారు.

అవ‌స‌రం లేదు అనుకుంటే ఎవ‌రినైనా దూరం పెట్టేస్తారు.కానీ కొన్ని సార్లు ఈ విధా ‌న‌మే ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు అంటే.కేసీఆర్ ఒక‌ప్పుడు వ‌ద్దు అనుకున్న వారే ఇప్పుడు కీల‌కం కాబోతున్నారు.పైగా వారు కూడా ఆయ‌న పార్టీకి చెందిన వారే.ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీకి కేసీఆర్ రెడీ అవుతున్నారు.

అయితే ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేయాలంటే టీఆర్ ఎస్ ఎంపీటీసీలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు కీల‌కం కాబోతున్నారు.వీరంద‌రినీ ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

త‌మ‌కు క‌నీసం ఆఫీసు కూడా లేద‌ని, నిధులు ఇవ్వ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu Adiyam Srihari, Harish Rao, Mlcs, Mptcs, Trs, Ts Potics, Zptcs-Telugu Pol

ఇక ఇప్ప‌టికి వీరితో కేసీఆర్‌కు అవ‌స‌రం రావ‌డంతో వారంతా త‌మ డిమాండ్లకు తలొగ్గేలా ప్రయత్నిస్తున్నారు.అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునేందుకు వీరంతా రెడీ అవుతున్నారు.దీంతో కేసీఆర్‌కు కొత్త చిక్కులు వ‌స్తున్నాయి.ఎంపీటీసీలు త‌మ వేతనం రూ.15 వేలకు పెంచుతూ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరుతున్నారు.పైగా పంచాయతీలో ఆఫీసుల్లో త‌మ‌కు గౌరవప్రదమైన స్థానం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.ఇక వీట‌న్నింటిపై ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రులు చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.ఒక‌వేల డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే ఎంపీటీసీలే ఎమ్మెల్సీ స్థానా‌లకు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.మ‌రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube