షాకింగ్: మెడికల్ ఎగ్జామ్‌లో కూడా పాసైన చాట్‌జీపీటీ... మనుషుల కంటే బెస్ట్‌ స్కోర్‌ చేసిందట?

సాంకేతిక ప్రపంచంలో చాట్‌జీపీటీ ( ChatGPT ) పెను సంచలనాలు సృష్టిస్తూ ప్రత్యర్థి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ క్రమంలో తన సామర్థ్యాలను అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది.

 Chatgpt 4 Passes Neuro Surgery Mock Medical Exam Details, Technology Updates, Te-TeluguStop.com

ఏఐ చాట్‌బాట్( AI Chatbot ) రోజురోజుకీ మరింత శక్తివంతంగా మారుతుండడంతో ఇది ఉద్యోగులను కూడా భర్తీ చేస్తుందనే భయం ఈమధ్యకాలంలో రెట్టింపు అవుతోంది.ఇక లేటెస్ట్ వెర్షన్ చాట్‌జీపీటీ-4 న్యూరో సర్జరీ పరీక్షలో( Neuro Surgery Exam ) మానవుల కంటే మెరుగైన స్కోరు సాధించి ఆరోగ్య నిపుణులను అవాక్కయేలా చేసింది.

అమెరికన్ బోర్డ్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జరీ మాక్ ఎగ్జామ్‌ క్వశ్చన్ పేపర్‌ ఒకదానిని క్రియేట్ చేసారు.ఆ పరీక్షలో ఈ ఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.చాట్‌జీపీటీ తాజా వెర్షన్ మెరుగ్గా సమాధానాలు రాయగా.ఇది మానవ నిపుణులను భర్తీ చేయగలదనే ఆందోళనలను ఇపుడు కలిగిస్తోంది.“పర్ఫామెన్స్ ఆఫ్ చాట్‌జీపీటీ అండ్ జీపీటీ-4 ఆన్ న్యూరోసర్జరీ రిటన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్” అనే టైటిల్‌తో చేసిన ఆ అధ్యయనాన్ని MedRxivలో పోస్ట్ చేయగా అది కాస్త ట్రెండింగ్ అవుతోంది.

MedRxiv అనేది ఒక ఆరోగ్య శాస్త్రాల ప్రీ-ప్రింట్ సర్వర్‌.ఇకపోతే ఓల్డ్ చాట్‌జీపీటీ వెర్షన్ లేదా జీపీటీ-3.5 వైద్య విద్యార్థుల బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు మాత్రమే సాధించగా లేటెస్ట్ వెర్షన్ జీపీటీ-4 దాని మునుపటి వెర్షన్‌తో పోల్చితే పరీక్షలలో మెరుగ్గా రాణించిందని తెలుస్తోంది.మెడికల్ స్టూడెంట్ బోర్డ్ పరీక్షలలో 12 ప్రశ్నల కేటగిరీలలో జీపీటీ-4 ప్రతిదానిలో వినియోగదారుల కంటే చాలా ఎక్కువ స్కోరు చేయడం విశేషం.ఇది కణితి ప్రశ్నల విభాగంలో క్వశ్చన్ బ్యాంక్ యూజర్లతో సహా చాట్‌జీపీటీని అధిగమించింది.అధ్యయనం ప్రకారం, ఈ పరీక్షలో చాట్‌జీపీటీ (జీపీటీ-3.5) 73.4 శాతం, జీపీటీ-4 83.4 శాతం స్కోర్‌లను సాధించగా.వినియోగదారులు సగటున 73.7 శాతం మార్కులు సాధించడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube