తెలంగాణ కాంగ్రెస్ దే అంటున్న ముందస్తు సర్వేలు!

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇలా ప్రకటించబడిందో లేదో అప్పుడే ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్టులు వీర విహారం చేస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు అధికార బారాసకు అనుకూలంగా ఉన్న వాతావరణం ఇప్పుడు హస్తం పార్టీ వైపు తిరిగిందని గాలి మారింది అన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్లు అంచనా వేస్తున్నాయి.

 Congress Ahed In Telangana Survey Reports ,telangana Congress, Brs , Bjp, Ts P-TeluguStop.com

లోక్ పాల్ సర్వే మరియు ఏబీపీ సి వోటర్ సర్వే కాంగ్రెస్ ( Telangana congress )దే అదికారం అంటూ తేల్చేశాయి.అధికార బారాసకు 45 నుంచి 50 సీట్లు వస్తే కాంగ్రెస్కు 48 నుంచి 60 వరకు రావొచ్చు అంటూ ఈ సర్వేలు అంచనా వేస్తున్నాయి.

భాజపాక ( BJP )అయితే ఐదు నుంచి 11 మధ్యలో ఫలితాలు వస్తాయని అంచనాల సారాంశం.అయితే వీటిని పేయిడ్ సర్వే లంటూ అధికార బారాస కొట్టి పాడేస్తున్నప్పటికీ కర్ణాటక ఎన్నికలలో ఈ సర్వేల ఫలితాలు విశ్వసనీయంగా ఉండడంతో ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ మ్యాజిక్ చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Cm Kcr, Rahul Gandhi, Revanth Reddy, Ts-Telugu Political News

అభివృద్ధి విషయం లో భారతీయ రాష్ట్ర సమితి( BRS party ) కి మంచి మార్కులే పడినప్పటికీ అవినీతి ఆరోపణలు కూడా బారాస ఎమ్మెల్యేలపై భారీ ఎత్తున వచ్చాయి.ముఖ్యంగా భూముల కబ్జాలు, ముడుపుల వ్యవహారాలలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.అంతేకాకుండా కేంద్ర లో అధికారం మోజుతో భారీ ఎత్తున ఇక్కడ అవినీతి చేసిన సొమ్మును ఖర్చు పెట్టారని, ఇతర పార్టీలకు ఫండింగ్ చేయడానికి ఆఫర్లు ఇచ్చారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.దాంతో తెలంగాణ ఓటర్ కు బారాస పై విముఖత కలిగిందని కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో గ్రౌండ్ లెవెల్ లో వోటర్ ఉన్నాడన్నది రాజకీయ పరిశీలకుల అంచనా .

Telugu Cm Kcr, Rahul Gandhi, Revanth Reddy, Ts-Telugu Political News

అయితే ఇప్పటికిప్పుడు బారాస కు వచ్చిన ముప్పేమీ లేదని ఇంకా 50 రోజుల సమయం ఉండడంతో పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ఇంకా అదికార పార్టీకి అవకాశాలు మిగిలే ఉన్నాయని ఉన్న ఈ తక్కువ సమయంలో ఓటరును ప్రసన్నం చేసుకుంటే గనక హ్యాట్రిక్ రిపీట్ చేయడం పెద్ద కష్టం కాదని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.అయితే ఎన్నికలు దగ్గరకు రావడం పార్టీల ఎత్తులు పై ఎత్తులతో ఇక్కడ రోజుకొక పార్టీ వైపు గాలి మళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టుగా ఉంది .మరి చివరి వరకు పట్టు నిలుపుకునేవారే విజేత గా మారతారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube