ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారత జాగృతి దీక్షకు అనుమతి లభించింది.మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే జంతర్ మంతర్ వద్ద దీక్ష కోసం జాగృతి నేతలు ముందుగానే అనుమతి తీసుకున్నారు.ఈ క్రమంలో అనుమతి నిరాకరించిన పోలీసులు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనుమతిని ఇచ్చారని తెలుస్తోంది.
దీంతో జంతర్ మంతర్ లో రేపు యథావిధిగా కవిత దీక్ష నిర్వహించనున్నారు.
మరోవైపు బీజేపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాం కు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు సిద్ధమైయ్యారని సమాచారం.
ఈ మేరకు జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం దరఖాస్తు చేసుకున్నారు.బీఆర్ఎస్ అభ్యంతరం నేపథ్యంలో బీజేపీ ధర్నా వేదికను మార్చుకుంది.
దీన్ దయాల్ మార్గ్ లోని ఆంధ్రా స్కూల్ వద్ద బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పోటాపోటీ దీక్షలతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది.







