జీర్ణాశయ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.వీటిని అశ్రద్ధ చేస్తే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల జీర్ణవ్యవస్థ సరిగా
పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారా?
ఏమి లేదు మీరు చేయవలసిందల్లా ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి.ఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ప్రతి రోజు
తీసుకోవాలి.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
పెరుగు
పెరుగులో ఉన్న అద్భుతమైన లక్షణాలు పేగుల్లో ఉండే చెడు బాక్టీరియాను
తొలగించి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.దాంతో తీసుకున్న ఆహారం
బాగా జీర్ణం అవుతుంది.
తద్వారా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దారికి
చేరవు.
తృణ ధాన్యాలు
తృణ ధాన్యాలు అంటే ముడి బియ్యం, ఓట్స్, గోధుమల వంటి వాటిలో ఫైబర్ అధికంగా
ఉంటుంది.
వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడి
అజీర్ణం సమస్య తగ్గుతుంది.
అరటిపండు
అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ గ్యాస్, అసిడిటీ ఉండవు.
మలబద్దకం వంటి
సమస్యలను దూరం చేసి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
అల్లం
ప్రతి రోజు రెండు స్పూన్ల అల్లం రసాన్ని ఉదయం పరగడుపున తీసుకుంటే జీర్ణ
సమస్యలు తగ్గిపోతాయి.
వికారం, మార్నింగ్ సిక్‌నెస్, అజీర్ణం వంటి
సమస్యలకు అల్లంను అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు.
పాప్ కార్న్
పాప్‌కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలకు ఫైబర్ చెక్ పెడుతుంది.కనుక పాప్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.