బట్టతల.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపించేది.
అయితే ప్రస్తుత రోజుల్లో యంగ్ ఏజ్‌లో ఉన్న వారిని సైతం బట్టతల కలవర పెడుతోంది.ఒక వయస్సు వచ్చిన తర్వాత జుట్టు రాలినా పెద్ద ఇబ్బందేమి ఉండదు.
కానీ, పెళ్లి అవ్వకముందే జుట్టు రాలడం ప్రారంభమైతే.ఇక వారి బాధ వర్ణణాతీతం.
అయితే బట్టతల రావడానికి తమకు ఉండే చెడు అలవాట్లు కూడా కారణం అవుతుంటాయి.ఆ అలవాట్లను వదులుకోకుంటే బట్టతల రావడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం బట్టతల రాకుండా ఉండాలంటే ఏయే అలవాట్లను వదులుకోవాలో తెలుసుకుందాం పదండీ.
సాధారణంగా కొందరు పురుషులు ఎల్లప్పుడూ టోపీలను ధరిస్తుంటారు.
టోపీ లేనిదే బయట కాలు కూడా పెట్టరు.ఈ అలవాటు మీకు ఉందా.? అయితే దాన్ని వదులుకోవడమే మంచిది.ఎందుకంటే, టోపీని తరచూ ధరించడం వల్ల జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి.
జుట్టు యొక్క మూలాలు బలహీనపడతాయి.దాంతో హెయిర్ ఫాల్ పెరిగి బట్టతలకు దారితీస్తుంది.
అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు టవల్‌తో గట్టిగా రుద్దేయడం, దువ్వడం చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తీవ్రంగా మారుతుంది.
ఫలితంగా బట్టతల ఏర్పడుతుంది.కొందరు పురుషులు హెయిర్ స్టైలింగ్ కోసం రసాయనాలతో నిండి ఉండే ఉత్పత్తులను యూస్ చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అదే సమయంలో బట్టతల వచ్చే రిస్క్ పెరుగుతుంది.

రెగ్యులర్‌గా షాంపూ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.ఈ అలవాటు వల్లా బట్టతల ముప్పు పెరుగుతుంది.అందుకే వారంలో రెండు సార్లకు మించి షాంపూ చేసుకోకపోవడం మంచిది.ఇక మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల సైతం బట్టతల వస్తుంది.కాబట్టి, ఈ అలవాట్లను ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిది.